Share News

అంగనవాడీలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:35 AM

అంగనవాడీలకు ప్రభుత్వం పథకాలు అమలు చేయాలని అంగనవాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ అసోసియేషన జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి.నిర్మల డిమాండ్‌ చేశారు.

అంగనవాడీలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న అంగనవాడీలు

యూనియన గౌరవ అధ్యక్షురాలు పి.నిర్మల

కర్నూలు న్యూసిటీ, జూన 23(ఆంధ్రజ్యోతి): అంగనవాడీలకు ప్రభుత్వం పథకాలు అమలు చేయాలని అంగనవాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ అసోసియేషన జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి.నిర్మల డిమాండ్‌ చేశారు. అంగనవాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట యూనియన అధ్యక్షురాలు రేణుక అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిర్మల మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 42 రోజులు సమ్మె చేసి సాధించుకున్న వాటిని కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని సాధించుకున్న జీవోను కూడా అమలు చేయకపో వడం వల్ల ఈ సారి తల్లికి వందనం డబ్బులు అంగనవాడీల పిల్లలకు పడలేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌. రాధాక్రిష్ణ, నగర కార్యదర్శి సీహెచ. సాయి బాబా, విజయ్‌, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి.గురుశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:35 AM