ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:50 PM
ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని వర్తింపజేసేలా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డోన ఎమ్మె ల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి
బేతంచెర్ల, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని వర్తింపజేసేలా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డోన ఎమ్మె ల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం బేతంచెర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయ ప్రాంగణంలో కూటమి నాయకులు, కార్యకర్తలు బూత క్లస్టర్ యూనిట్ ఇనచా ర్జిలతో విస్తృత స్థాయి సమా వేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 16న ఉమ్మడి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యట నను విజయవంతం చేయా లని కార్య కర్తలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్ర మంలో టీడీపీ మండల కన్వీనర్ ఎల్ల నాగయ్య, టీడీపీ సీనియర్ నాయకు రాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి, పోలూరు రాఘవరెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండా అశ్వర్థ నారాయణ, జిల్లా కార్యదర్శి నాగ మోహన, జనసేన మండల కార్యదర్శి శ్రీకంటి మధు పాల్గొన్నారు.