Share News

హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:26 AM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే విరుపాక్షి విమర్శిం చారు.

హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
క్యూ ఆర్‌ కోడ్‌ను విడుదల చేస్తున్న వైసీపీ నాయకులు

వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే విరుపాక్షి

ఆలూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే విరుపాక్షి విమర్శిం చారు. మంగళవారం ఆలూరులోని ఉమా కళ్యాణ మండపంలో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ క్యూ ఆర్‌ కోడ్‌ స్కానర్‌ను ఆవిష్కరిం చారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అందలేదని, చంద్ర బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అని చెబుతూ క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చంద్రబాబు మీకు ఎంత అప్పు ఉన్నారో చూపిస్తుందన్నారు. దొంగ హామీలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని, రైతు లకు అన్నదాత సుఖీభవ పథకం ఇంతవరకూ ఇవ్వలేద న్నారు. 18 సంవత్సరాల మహి ళలకు నెలకు రూ.1,500లు, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు. ఏడాదికే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిం దన్నారు. తెర్నెకల్‌ సురేంద్రరెడ్డి, మల్లికార్జున, మారయ్య, ఎంపీపీ రంగమ్మ, దేవనకొండ, ఆస్పరి, జెడ్పీటీసీ కిట్టు, దొరబాబు, వైసీపీ నాయకులు గిరి, భాస్కర్‌, శీనప్ప, శేషప్ప, లుమాంబ, అరికెర వీరేష్‌, నీలకంఠ, రామాంజనేయులు, మహానంది, కొట్టాల రాజు, వరుణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 12:26 AM