క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:07 AM
క్రీడాకారులకు ఏ ప్రభుత్వంలో లేని విధంగా కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని ఎస్‌జీఎఫ్ స్టేట్ అబ్జర్వర్ ప్రభాకర్ అన్నారు.
ఎస్‌జీఎఫ్ స్టేట్ అబ్జర్వర్ ప్రభాకర్
రాష్ట్రస్థాయి అండర్-19 ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
ఎమ్మిగనూరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): క్రీడాకారులకు ఏ ప్రభుత్వంలో లేని విధంగా కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని ఎస్‌జీఎఫ్ స్టేట్ అబ్జర్వర్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఎమ్మిగనూరులోని జూనియర్ కళాశాల మైదానంలో అండర్ -19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కర్నూలు సెక్రటరీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారం భమయ్యాయి. మార్కెట్‌యార్డు చైర్మన్ మల్లయ్య, టీడీపీ నాయకులు బాస్కర్ల చంద్రశేఖర్, మహెష్, మహేంద్ర, డా మల్లెల ఆల్‌ఫ్రెడ్‌రాజు, కౌన్సిలర్ రామదాసు గౌడ్, మాజీ కౌన్సిలర్లు రామకృష్ణ నాయుడు, ముల్లా కలీముల్లా జ్యోతివెలిగించి పోటీలను ప్రారంభించారు. జాతీయజెండాను, స్కూల్‌గేమ్స్ పథాకాన్ని నాయకులు ఎగురవేశారు. కార్యక్రమానికి హాజరైన నాయకులకు, అధికారులకు వివిధజిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు 3శాతం రిజర్వేషన్ కల్పించిందన్నారు. డీఎస్సీ లేకుండా నేరుగా టీచర్ పోస్టులు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుంద న్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో పాల్గొనకుండానే నేరుగా 50మందికి టీచర్ పోస్టులు ఇచ్చిందన్నారు. ఎమ్మిగనూరు ఫుట్‌బాల్‌కు పెట్టింది పేరు అన్నారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ క్రీడలకు పుట్టినిల్లు ఎమ్మిగనూరు అని ఎంతో మంది క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు. క్రీడాభివృద్ధి కోసం దివంగత నేత బీవీ మోహాన్‌రెడ్డి ఎంతో కృషిచేశారన్నారు. కార్యక్రమంలో పీడీలు రామాంజనేయులు, అస్లాం, హనీఫ్, విక్రమ్, శీను, శ్రీరామ్, నరసింహరాజు, రాఘవేంద్ర, టీడీపీ నాయకులు ఉసేన్ పీరా, బందే నవాజ్ కామర్తి మహెష్, రాజేష్, అబ్దుల్లా, దోమా భీమేష్, ఉరుకుందు, జయన్న తదితరులు పాల్గొన్నారు.