Share News

రైతును దగా చేసిన ప్రభుత్వం

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:31 AM

రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేసిందని ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి, ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌చార్జి బుట్టా రేణుక ఆరోపించారు. మంగళవారం ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల నాయకులు ఆదోనిలో ర్యాలీ నిర్వహిం చారు

రైతును దగా చేసిన ప్రభుత్వం
ఆదోనిలో ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నాయకులు

ఆదోని, పత్తికొండలో వైసీపీ ‘అన్నదాత పోరు’

ఆదోని అగ్రికల్చర్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేసిందని ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి, ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌చార్జి బుట్టా రేణుక ఆరోపించారు. మంగళవారం ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల నాయకులు ఆదోనిలో ర్యాలీ నిర్వహిం చారు. ఖరీఫ్‌లో రైతులకు ఎరువులను సక్రమంగా పింపిణీ చేయడం లేదని ఆరోపించారు. యూరియా కొరతతో రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడానికే చూస్తోందన్నారు. ఉల్లి రైతుకు గిట్టుబాటు లేక పొలాల్లోనే వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయాలని, పంటలకు గిట్టుబాలు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. మంత్రాలయం నాయకుడు ప్రదీప్‌ రెడ్డి, ఎమ్మిగనూరు మాజీ ఇన్‌చార్జి ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి, చంద్రకాంత్‌ రెడ్డి, దేవా, లోకేశ్వరి, గుర్నాథ్‌ రెడ్డి, శేశిరెడ్డి ఫయాజ్‌, నాగరాజు పాల్గొన్నారు.

రైతు పోరులో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద మాట్లాడుతుం డగా కళ్లు తిరిగి పక్కకు ఒరిగారు. కార్యకర్తలు అప్రమత్తమై నీడలోకి తీసుకెళ్లి నీళ్లు తాపారు

రైతులను ఆదుకోలేని ప్రభుత్వం

పత్తికొండ టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోలేక చేతగాని ప్రభుత్వంగా మారిందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి విమర్శించారు. మంగళవారం పట్టణంలోని అన్నదాత పోరు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి నాలుగు స్తంభాల కూడలి నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీవో భరత్‌కు వినతి పత్రం అందించారు. నాయకులు ప్రదీప్‌రెడ్డి, పరిశీలకుడు సురేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి శశికళ, ఎంపీపీ నారాయణదాసు, శ్రీరంగడు, రామచంద్ర, సోమశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 12:31 AM