Share News

రైతు అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:36 AM

రైతు అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, వారికోసమే సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం ఓర్వకల్లులోని పొదుపు ఐక్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ రెండో విడత చెక్కులను విడుదల చేశారు.

రైతు అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఓర్వకల్లులో రైతులకు చెక్కు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

రైతులకు అన్నదాత సుఖీభవ మెగా చెక్కు విడుదల

ఓర్వకల్లు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రైతు అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, వారికోసమే సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం ఓర్వకల్లులోని పొదుపు ఐక్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ రెండో విడత చెక్కులను విడుదల చేశారు. ముందుగా సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని తిలకించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం, కల్లూరు మండలాలకు చెందిన 27,378 రైతులకు రూ.22,02 కోట్లు రెండో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేశామన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూసిందని విమర్శించారు. తాము రైతు సంక్షేమమే ధ్యేయంగా అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌పథకాల్లో భాగంగా రైతులు నష్టపోకూడదన్న లక్ష్యంతో అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పంట సాగు పెట్టుబడికి రైతులు ఇబ్బందులు పడకుండా రూ.20వేలు ఇవ్వడం హర్షణీయమన్నారు. నంద్యాల టీడీపీ జిల్లా అద్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, ఏడీఏ రాజశేఖర్‌, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, ఎంపీడీవో నాగ అనసూయ, నాలుగు మండలాల సొసైటీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:36 AM