అందరూ చదవాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jul 25 , 2025 | 12:20 AM
కుటుంబంలోని అందరూ చదువుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
తుగ్గలి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కుటుంబంలోని అందరూ చదువుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. గురువారం మండలంలోని రాతన గ్రామంలో తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మనోహర్ చౌదరి ఆధ్వర్యంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు వివరించి సమస్యలను తెలుసుకున్నారు. చెరువుల న్నిటినీ హంద్రీనీవా నీటితో నింపుతామ న్నారు. తుగ్గలి నాగేంద్ర, మనోహర్ చౌదరి, వెంకటపతి, కృష్ణమూర్తి చౌదరి, ఈరన్నస్వామి ఉన్నారు.