అభివృద్ధి, సంక్షేమంతో పాలన
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:53 AM
రాష్ట్రంలో ఓ వైపు అభి వృద్ధి, మరో వైపు సంక్షేమం దిశగా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత
మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓ వైపు అభి వృద్ధి, మరో వైపు సంక్షేమం దిశగా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు భ్రస్టు పట్టాయని, కూటమి పాలన వచ్చిన తర్వాతనే ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు తన సామర్థ్యంతో మెరుగు పరిచారన్నారు. శనివారం కర్నూలు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం యార్డు ప్రాంగణం లో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి టీజీ భరత, కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆదోని టీడీపీ ఇనచార్జి మీనాక్షినా యుడు, ఎస్సీ కార్పొరేషన చైర్మన ఆకెపోగు ప్రభాకర్ హాజరయ్యారు. కర్నూలు మార్కెట్ కమిటీ సెలక్షన గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి, చైర్‌పర్సన గొల్కోండ అజ్మిత బీ, వైస్ చైర్మన శేషగిరిశెట్టి, డైరెక్టర్లతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి టీజీ భరత మాట్లా డుతూ కర్నూలు నగరానికి చెందిన వారికి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన పదవి దక్కడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు గోల్కొండ హామీద్, అబ్బాస్, సెలక్షన గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, శివన్న, నగేష్ పాల్గొన్నారు.