Share News

భవితకు భరోసానిచ్చేలా పాలన

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:38 PM

రాష్ట్రంలో గడిచిన 15 నెలల కూటమి పాలన భవితకు భరోసానిచ్చేలా సాగిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

భవితకు భరోసానిచ్చేలా పాలన
మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

బనగానపల్లె, సెప్టెంబరు 8, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గడిచిన 15 నెలల కూటమి పాలన భవితకు భరోసానిచ్చేలా సాగిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ఆర్థిక కష్టాలను దాటి సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేశామన్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కేంద్రంలో ఈనెల పదో తేదీన జరిగే సూపర్‌ సిక్స్‌ సక్సెస్‌ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైసీపీ అన్నదాత పోరుకు రైతుల నుంచే స్పందన కరువైందన్నారు. నాడు రైతు పంట భీమాకు ఎగనామం పెట్టి నేడు వైసీపీ నీతులు చెబుతోందని విమర్శించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన సాగుతోందన్నారు. దీంతో వైసీపీ నాయకులకు గుబులు మొదలైందన్నారు. యూరియాను కొందరు అవసరానికి మించి కొనుగోలు చేయడంతో క్షేత్రస్థాయిలో యూరియా కొరతకు కారణమైందన్నారు. యూరియా బ్లాక్‌ మార్కెట్‌కు అస్కారం లేకుండా తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోదన్నారు. ప్రస్తుతం 1,200 క్వింటాళ్ల ఉల్లిని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. వైసీపీ నాయకులు ఏపీలోని వైద్యశాలలు ప్రైవేటీకరణ చేస్తున్నట్లు వదంతులు పుట్టిస్తున్నారన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 11:38 PM