క్రీడలతో సత్సంబంధాలు
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:10 AM
క్రీడలతో సత్సంబంధాలు ఏర్పడతాయని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. గురువారం అవుట్‌డోర్ స్టేడియంలో 44వ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మీట్ అండ్ సెలక్షన్ నిర్వహించారు.
కర్నూలు స్పోర్ట్స్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో సత్సంబంధాలు ఏర్పడతాయని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. గురువారం అవుట్‌డోర్ స్టేడియంలో 44వ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మీట్ అండ్ సెలక్షన్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన టీజీ మాట్లాడుతూ తనకు క్రీడల పట్ల ఆసక్తి ఉందని, అందుకే ప్రోత్సాహిస్తునన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా క్రీడల అభివృద్దికి గానూ ప్రతి మండలంలో ఒక స్టేడియం నిర్మాణానికి నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించానన్నారు. నగరంలో ప్రతి వార్డులో మినీ ఇండోర్ స్టేడియం నిర్మించే దిశగా ప్రయత్నించి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. గత ప్రభుత్వం వాటిని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చిందన్నారు. వాకర్స్‌కు కేసీ కెనాల్ పొడవునా, తుంగభధ్ర నది తీరాన ట్రాక్ నిర్మించామన్నారు. నగరంలో క్రీడల అభివృద్దికి ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో అవుట్‌డోర్ స్టేడియం, పంచలింగాలో రాయలసీమ యూనివర్సిటీలలో ఇండోర్ స్టేడియాలను సొంత నిధులతో నిర్మించినట్లు ఆయన తెలిపారు. మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పతకాలు సాధించిన వారిని సన్మానించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి, డీఎస్‌డీవో భూపతిరావు, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, రామచంద్రారెడ్డి, సురేంద్ర పాల్గొన్నారు