Share News

సత్ప్రవర్తనతో మెలగాలి

ABN , Publish Date - May 27 , 2025 | 11:35 PM

ఖైదీలు జైలు జీవితం తర్వాత సత్ప్రవర్తనతో మెలగాలని ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయసేవా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు.

సత్ప్రవర్తనతో మెలగాలి
కార్యక్రమంలో పాల్గొన్న వెంకటశేషాద్రి

నంద్యాల క్రైం, మే 27 (ఆంధ్రజ్యోతి): ఖైదీలు జైలు జీవితం తర్వాత సత్ప్రవర్తనతో మెలగాలని ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయసేవా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. మంగళవారం నంద్యాలలోని స్పెషల్‌ సబ్‌ జైలును ఆయన తనిఖీ చేశారు. 70ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉచిత న్యాయ సహాయం అందజేస్తామన్నారు. జైలు ఖైదీలకు ప్రిజన్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ గురించి వివరించారు. ఖైదీలకు న్యాయసలహాలు అందించేందుకు ఈ విభాగం సిద్ధంగా ఉంటుందన్నారు. 15011 హెల్ప్‌ లైన్‌ నెంబర్‌పై ఖైదీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ గురుప్రసాద్‌రెడ్డి, డా. గురుకుమార్‌, న్యాయవాదులు బాలునాయక్‌, శేషసాయిబాబ, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:35 PM