బీర.. కరువు తీర
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:27 PM
మండలంలోని తెర్నేకల్‌కు చెందిన ఉప్పర సొట్ట రాముడు తనకు 1.5 ఎకరాలు ఉండగా, 80 సెంట్లలో బీర సాగు చేశాడు.

రూ.50వేల పెట్టుబడితో రూ.1.5లక్షల ఆదాయం
దేవనకొండ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తెర్నేకల్‌కు చెందిన ఉప్పర సొట్ట రాముడు తనకు 1.5 ఎకరాలు ఉండగా, 80 సెంట్లలో బీర సాగు చేశాడు. గతే ఏడాది రూ.50 వేలు పెట్టుబడి పెట్టి సాగుచేయగా 1.5 లక్షల ఆదాయం వచ్చింది. అనంతరం ఈ ఏడాది కూడా బీర సాగు చేయగా కోతలు కోశారు. తాను 600 కర్రలను ఒక్కొక్కటి రూ.70ల ప్రకారం కొనుగుచేశానని, కర్రకు రెండగుడుగుల ఎడం పాటించానన్నాడు. ఇలా కర్రలు పాతి సాగుచేస్తే కాయకు మచ్చల ప్రభావం ఉండదన్నారు.