Share News

గోల్డ్‌ అప్రైజర్‌ చేతివాటం

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:28 AM

ఓ గోల్డ్‌ అప్రైజర్‌(బంగారు ఆభరణాల మూల్యాంకన నిపుణుడు) చేతివాటం ప్రదర్శించాడు.

గోల్డ్‌ అప్రైజర్‌ చేతివాటం
బ్యాంక్‌ అధికారులతో వాగ్వాదానికి దిగిన ఖాతాదారులు

ఖాతాదారుల పేర్ల మీద నకిలీ బంగారం తాకట్టు

బ్యాంక్‌ వద్ద బాధితుల ఆందోళన

ఆరేళ్లుగా హోల్డ్‌లో అకౌంట్లు

అవుకు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఓ గోల్డ్‌ అప్రైజర్‌(బంగారు ఆభరణాల మూల్యాంకన నిపుణుడు) చేతివాటం ప్రదర్శించాడు. ఖాతా దారుల పేర్ల మీద నకిలీ బంగారం తాకట్టుపెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఈవిషయం బయటకు రావడంతో మండలంలోని రామాపురం యూని యన బ్యాంక్‌ వద్ద ఖాతాదారులు మంగళవారం ఆందోళనకు దిగారు. గతంలోని ఆంరఽధ బ్యాంక్‌ యూనియన బ్యాంక్‌లో విలీనం కాక ముందు అనగా 2019లో బ్యాంక్‌లో పనిచేస్తున్న గోల్డ్‌ అప్రైజర్‌ ప్రదర్శించిన చేతివాటం ఖాతాదారులకు శాపంగా మారింది. అప్పటి గోల్డ్‌ అప్రైజర్‌ శ్రీనివాసులు బ్యాంకులోని 19 మంది ఖాతాదారుల పేరుమీద నకిలీ బంగారం తాకట్టుపెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఖాతాదారుల పేరుతో నకిలీ బంగారం తాకట్టులో ఉండటంతో బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదు మేరకు రామాపురం, చనుగొండ్ల, అవుకు, శింగనపల్లి గ్రామాలకు చెం దిన ఖాతాదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో జరి గిన బ్యాంక్‌ అధికారుల ఆడిట్‌లో గోల్డ్‌ అప్రైజర్‌ బండారం వెలుగుచూ డటం సంచలనంగా మారింది. ఖాతాదారులకు తెలి యకుండా బ్యాంక్‌ లో పనిచేస్తున్న గోల్డ్‌ అప్రైజర్‌ నకిలీ బంగారం తాకట్టు పెట్టినట్లు బయ టపడింది. అయినప్పటికీ ఆరేళ్లుగా బాధిత ఖాతాదారుల అకౌం ట్లను బ్యాంక్‌ అధికారులు హోల్డ్‌లో ఉంచారు. బ్యాంక్‌లో ఖాతాదారులు లవాదేవీలు చేసుకొనే అవకాశం లేకపోటంతో ఇబ్బందులు పడుతూ వచ్చారు. సహనం కోల్పోయిన ఖాతాదారులు బ్యాంక్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్యాంక్‌కు తాళాలు వేసి నిరసనకు దిగారు. బ్యాంక్‌ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని హోల్డ్‌లో ఉంచిన అకౌంట్లను రిలీజ్‌ చేయాలని బాధిత ఖాతాదారులు కోరుతున్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:28 AM