క్రీస్తు ద్వారా లోకానికి దేవుని ప్రేమ
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:30 AM
నగరంలోని ఐదురోడ్ల కూడలిలో ఉన్న రాక్‌వుడ్ మెమోరియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో గురువారం రాత్రి క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఘనంగా నిర్వహించారు.
రాక్‌వుడ్ చర్చిలో క్యాండిల్ లైటింగ్ సర్వీస్
కర్నూలు కల్చరల్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఐదురోడ్ల కూడలిలో ఉన్న రాక్‌వుడ్ మెమోరియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో గురువారం రాత్రి క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య ప్రసంగీకుడు సీయోను ప్రేయర్ హౌస్ వ్యవస్థాపకుడు డాక్టర్ జి. శాంతిరాజు మాట్లాడుతూ యోహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మానవ రూపంలో ఈ లోకానికి పంపి సర్వ మానవాళికి ఆయన ద్వారా ప్రేమ మార్గాన్ని బోధించారని చెప్పారు. క్రీస్తు ప్రభువు బోధనలు ఆచరిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరూ శాంతితో జీవించాలన్నారు. చర్చి క్వాయర్ డైరెక్టర్లు డాక్టర్ పి.సుప్రియ, శ్యామ్యూల్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ గీతాలు పాడారు. కన్వీనర్ ఆనందరావు, కార్యదర్శి ఎల్‌వై బెంజిమెన్ రాజు, కోశాధికారి బీవీ స్వరూ్‌పసిన్హా, ఈసీ మెంబర్ వైజే మనోహర్ పాల్గొన్నారు.