సాధనతో లక్ష్యాలను సాధించాలి
ABN , Publish Date - May 14 , 2025 | 12:29 AM
క్రీడాకారులు క్రమశిక్షణతో కూడిన సాధన చేస్తేనే లక్ష్యాలను సాధించొచ్చునని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ
రాష్ట్రస్థాయి ఉషూ పోటీలు ప్రారంభం
11 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరు
కర్నూలు స్పోర్ట్స్, మే 13(ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు క్రమశిక్షణతో కూడిన సాధన చేస్తేనే లక్ష్యాలను సాధించొచ్చునని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు. మంగళవారం నగరంలోని బీ.క్యాంపులోని శ్రీలక్ష్మి టీజీ వెంకటేశ కల్యాణ మండపంలో జిల్లా ఉషూ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బీ.శంకర్‌శర్మ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 10వ సబ్ జూనియర్, 11వ జూనియర్, సీనియర్ పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, రాష్ట్ర ఉషూ సంఘం అధ్యక్ష, కార్య దర్శులు ఆదివిష్ణు, నరసింహరావు, జిల్లా ఒలింపిక్ సంఘం సీఈవో విజయకుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులుతో కలిసి టీజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉషూ లాంటి మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకుంటే ఆపద సమయాల్లో తమ ను తాము కాపాడుకోవడంతో పాటు ఇతరులను రక్షించేందుకు ఈక్రీడ దోహద పడుతుందన్నారు. జిల్లా ఉషూ సంఘం అధ్యక్షుడు డాక్టర్ శంకర్‌శర్మ మాట్లాడుతూ క్రీడాకారులు స్నేహభావాన్ని అలవర్చుకుని గెలపోట ములు సమానంగా స్వీకరించి పోటీల్లో పాల్గొనాలని తెలిపారు. రాష్ట్ర ఉషు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆదివిష్ణు, నరసిం హరావులు మాట్లాడుతూ 11 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో పోటీల నిర్వహక కార్యదర్శి టి.శ్రీనివాసులు, రాష్ట్ర ఉషూ సంఘం ఉపాధ్యక్షుడు సుందర్‌రావు, సంయుక్త కార్యదర్శి శివకుమార్, ఎనఎస్ శిక్షకుడు సాయి మోహన, రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ శెట్టి, జిల్లా స్కేటింగ్ సంఘం సీఈవో సునీల్‌కుమార్ పాల్గొన్నారు.