లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:27 AM
వివిధ శాఖల అభివృద్ధికి సంబంధించిన కీ ఫెర్ఫార్మెన్స ఇండికేటర్స్ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రంజిత బాషా అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): వివిధ శాఖల అభివృద్ధికి సంబంధించిన కీ ఫెర్ఫార్మెన్స ఇండికేటర్స్ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రంజిత బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స హాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖలకు నిర్దేశిం చిన కీ ఫెర్ఫార్మెన్స ఇండికేటర్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కీ ఫెర్ఫార్మెన్స ఇండికేటర్ల ఆదారంగానే కలెక్టర్ల కాన్ఫ రెన్స జిల్లా స్థాయి సమీక్ష, మండల స్థాయి సమీక్షలు ఉంటా యన్నారు. ఆయా శాఖల హెడ్ ఆఫీసు నుంచి కీ ఫెర్ఫార్మెన్స ఇండికే టర్స్‌ను జిల్లా లక్ష్యాలను కేటాయించారన్నారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, సీపీవో హిమప్రభాకర్ రాజు, జడ్పీ సీఈవో నాసరరెడ్డి పాల్గొన్నారు.