Share News

గ్లకోమాను ప్రాథమిక దశలో గుర్తించాలి: డీఎంహెచవో

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:29 AM

గ్లకోమా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేసే అవకాశం ఉందని డీఎంహెచ వో డా.పి.శాంతికళ అన్నారు.

గ్లకోమాను ప్రాథమిక దశలో గుర్తించాలి: డీఎంహెచవో
ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): గ్లకోమా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేసే అవకాశం ఉందని డీఎంహెచ వో డా.పి.శాంతికళ అన్నారు. వరల్డ్‌ గ్లకోమా డే ను పురస్కరిం చుకుని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని కర్నూలు ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో డీఎంహెచవో ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు గ్లకోమాను గుర్తించిన నివారించలేని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో వచ్చాయని అన్నారు. కంటి లోపల నీటి ప్రవాహాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చే చికిత్స అందుబాటులో ఉందన్నారు. ఐ-హాస్పిటల్‌ సూపరిం టెండెంట్‌ డా.పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సాధారణంగా 40 ఏళ్లు పై బడిన వారికి వచ్చే ఈ వ్యాధి విపరీతమైన ఒత్తిడి కారణంగా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. గ్లకోమా లేని సమాజం కోసం పాటు పడదాం అంటూ పిలుపునిచ్చారు. అనంతరం ఈ ర్యాలీ ప్రాంతీయ కం టి ఆసుపత్రి నుంచి కర్నూలు జీజీహెచ వరకు కొనసాగింది. కార్యక్ర మంలో ఐ-హాస్పిటల్‌ ప్రొఫెసర్‌ డా.సత్యనారాయణ రెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డా.హరిహరప్రసాద్‌, డా.శివప్రియ, ఆర్‌ ఎంవో డా.జి.భరత, వైద్యాధికారులు, అప్టోమెట్రిస్‌టలు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ కార్యదర్శి డా.ఎం.సంధ్యా రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:29 AM