నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:32 AM
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మెనూ పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమల దేవి ఆదేశించారు.
రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమల దేవి
పత్తికొండ టౌన్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మెనూ పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమల దేవి ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని రేషన్ దుకాణాలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాల, సివిల్ సప్లై గోదామును తనిఖీ చేశారు. అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు.
తుగ్గలి: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమల దేవి సూచించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసి, రోగులు, వైద్యులతో మాట్లాడారు. ప్రభుత్వం వైద్య సిబ్బందిని నియమించి, పరికాలను కూడా ఏర్పాటు చేసిందన్నారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా రోజూ వైద్యశాలకు వచ్చి రోగులకు సేవలు అందించాలన్నారు. వైద్యులు అమర్‌నాథ్, రోజారమణి, ప్రవీణ ఉన్నారు.
దేవనకొండ: స్థానిక 6వ అంగన్‌వాడీ కేంద్రం, ప్రాఽథామిక వైద్యశాలను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో స్టాకు వివరాలు, పిల్లలకు అందించే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఐసీడీఎస్ పీడీ విజయ, ఈవో రాజేశ్వరి, సీడీపీవో మద్దమ్మ, తహసీల్దార్ రామాంజీనేయులు, వైద్యాధికారి విజయబాస్కర్, సూపర్ వైజర్లు శివలింగమ్మ, చందన, తదితరులు ఉన్నారు.