Share News

మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:38 PM

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని కలెక్టర్‌ డా.ఎ.సిరి సూచించారు. మంగళవారం ఆమె పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు

మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి
హాస్టల్‌లో స్టడీ అవర్స్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

కోడుమూరు ఎస్సీ బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌ డా. సిరి

కోడుమూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని కలెక్టర్‌ డా.ఎ.సిరి సూచించారు. మంగళవారం ఆమె పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. హాస్టల్‌ పరిసరాలను, వంటగదిలో భోజన తయారీని పరిశీలించారు. వారంలో ఎన్నిసార్లు చికెన్‌, గుడ్డు ఇస్తున్నారని హాస్టల్‌ వార్డెన్‌ శిరీషను అడిగి తెలుసుకొన్నారు. వంట సరుకుల వివరాలు రికార్డులో పొందుపరచాలని సూచంచారు. హాస్టల్‌ గది పైకప్పు పెచ్చులూడుతోందని వార్డెన్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్‌ స్పందిస్తూ మరమ్మతులకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. హాస్టల్లో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ తిభోజనం మెనూ ప్రకారం ఇస్తున్నారా, రుచిగా ఉంటుందా? యూనిఫాం ఇచ్చారా, పాఠాలు అర్థం అవుతున్నాయా లేదా ? అని విద్యార్థినులను అడిగి తెలుసుకొన్నారు. ఇంచార్జ్‌ ఎంపీడీవో క్రిష్ణారెడ్డి, రీ సర్వే డీటీ కృష్ణమూర్తి ఉన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:38 PM