Share News

మెనూ ప్రకారం భోజనం అందించాలి

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:00 AM

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిం చాలని ఫుడ్‌ కమిషన సభ్యురాలు గంజిమల దేవి సూచిం చారు. బుధవారం జ్యోతిబా పూలే పాఠశాలను అనిఖీ చేశారు.

మెనూ ప్రకారం  భోజనం అందించాలి
భోజనాన్ని పరిశీలిస్తున్న గంజిమల దేవి

ఫుడ్‌ కమిషన్‌ సభ్యురాలు దేవి గంజిమల

బాలికల పాఠశాల హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు

వెల్దుర్తి టౌన్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిం చాలని ఫుడ్‌ కమిషన సభ్యురాలు గంజిమల దేవి సూచిం చారు. బుధవారం జ్యోతిబా పూలే పాఠశాలను అనిఖీ చేశారు. స్టోర్‌ రూం, స్టాక్‌ పాయింట్లను పరిశీలించి, విద్యార్థి నులతో మాట్లాడారు. ఉదయం టిఫిన్‌, రోజూ అరటి పండు ఇస్తున్నారా అని అడుగగా.. ఇవ్వడం లేదని విద్యార్థినులు తెలిపారు. దీంతో ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేసి, మనెనూ పాటించాలని సూచించారు. అంబేడ్కర్‌ గురుకులం, పట్టణం లోని బాలికల పాఠశాలను పరిశీలించారు. సరైన సమాధానం ఇవ్వని బాలికల పాఠశాల హెచ్‌ఎంకు నోటీసులు జారీ చేయాలని ఇన్‌చార్జి ఎంఈవోను ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించారు. తహసీల్దార్‌ చంద్రశేఖర వర్మ, డీటీ గురుస్వామి రెడ్డి ఉన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 12:00 AM