Share News

రేషన్‌ను సకాలంలో ఇవ్వాలి: సబ్‌ కలెక్టర్‌

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:55 PM

డీలర్లు కార్డుదారులకు సరుకులను సకాలంలో పంపిణీ చేయాలని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. ఆదివారం పట్టణం లోని అంబేడ్కర్‌ నగర్‌ కాలనీ షాప్‌ నెంబర్‌ 62లో రేషన్‌ పంపిణీని ప్రారంభించారు.

రేషన్‌ను సకాలంలో ఇవ్వాలి: సబ్‌ కలెక్టర్‌
సరుకుల పంపిణీ పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌,

ఆదోని, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): డీలర్లు కార్డుదారులకు సరుకులను సకాలంలో పంపిణీ చేయాలని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. ఆదివారం పట్టణం లోని అంబేడ్కర్‌ నగర్‌ కాలనీ షాప్‌ నెంబర్‌ 62లో రేషన్‌ పంపిణీని ప్రారంభించారు. దుకాణం వద్ద క్యూ ఆర్‌కోడ్‌ ఏర్పాటు చేశామని, ప్రజలు వారి అభిప్రాయాలు తెలియచేయాలన్నారు. తహసీల్దార్‌ శివ రాముడు, సీఎస్‌డీటీ వలిబాషా, రీ సర్వే డీటీ పెద్దయ్య పాల్గొన్నారు.

పేదలకు నాణ్యమైన సరుకులు ఇవ్వడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అన్నారు. ఆదివా రం పట్టణంలోని నారాయణగుంత కాలనీ లోని దుకాణంలో రేషన్‌ పంపిణీని ప్రారం భించారు. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌ చౌదరి, కురువ సంఘం నాయకులు మల్లికార్జున, కృష్ణ, శాంతమూర్తి, సిద్ద, రవి, వీరేష్‌ పాల్గొన్నారు.

ఆస్పరి: రేషన్‌ దుకాణాన్ని తహసీల్దార్‌ రామేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. మండలంలో 39 రేషన్‌ దుకాణాలు ఉన్నాయని, మొత్తం 19,613 రేషన్‌కార్డులు ఉన్నాయన్నారు.

పత్తికొండ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సేవచేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకే చౌక దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకీ శ్రీకారం చుట్టిం దని ఆర్డీవో భరత్‌నాయక్‌, తహసీల్దార్‌ రమేశ్‌ అన్నారు. టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, టీడీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర ఽఅధ్యక్షులు సురేశ్‌ ఆధ్వర్యంలో 10వ దుకాణంలో ఆదివారం సరుకుల పంపి ణీని ప్రారంభించారు.

తుగ్గలి: కార్డుదారులందరికీ రేషన్‌ ఇవ్వాలని పత్తికొండ ఆర్డీవో భరత్‌ నాయక్‌ డీలర్లను ఆదేశించారు. ఆదివారం రాతన, తుగ్గలిలోని రేషన్‌ దుకాణాలను తహసీల్దార్‌ రమాదేవి, టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మనోహర్‌ చౌదరితో పాటు రేషన్‌ పంపిణీని ప్రారంభించారు.

Updated Date - Jun 01 , 2025 | 11:58 PM