ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:22 AM
రెవెన్యూ ఉద్యోగులు సేవాభావంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవనంలో శుక్రవారం రెవెన్యూ డే సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల రక్తదాన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు.
‘రెవెన్యూ డే’లో కలెక్టర్ రంజిత్ బాషా
విశ్రాంత ఉద్యోగులకు సన్మానం
కర్నూలు కలెక్టరేట్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ ఉద్యోగులు సేవాభావంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవనంలో శుక్రవారం రెవెన్యూ డే సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల రక్తదాన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో రెవెన్యూ డే సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌తో పాటు జేసీ బి.నవ్య, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగి అయినా ఈ శాఖలో పని చేస్తున్నందుకు గర్వపడుతారన్నారు. రెవెన్యూ శాఖ అన్ని శాఖలకు తల్లిలాంటిదన్నారు. ప్రజలకు సేవలందించడంలో రెవెన్యూ శాఖ కీలకమైనది అన్నారు. జేసీ మాట్లాడుతూ అత్యధికంగా ప్రజలకు కావాల్సిన పనులు, వారి సమస్యల బాధ్యతలు మోయాల్సిన శాఖ రెవెన్యూ శాఖ అన్నారు. ఈ శాఖలో ప్రలోభాలు, ఒత్తిడి అధికంగా ఉంటాయని, వాటిని అధికమించి పని చేయాలని సూచించారు. ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి వెంక టేశ్వర్లు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో శ్రీరామ దాసు (కంచర్ల గోపన్న) భద్రాచలం తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని రెవెన్యూ శాఖ సిబ్బంది పని చేయాలని సూచించారు. అనంతరం విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు శశిదేవి, క్రిష్టఫర్, జయన్న, విజయుడు, హుశేన్, రమణ, ఆదినారాయణ, రామన్న, ఎల్ల రాముడు తదితరులను రెవెన్యూ సంఘం తరుపున కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఘనంగా సన్మానించారు. హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనూరాధ, అజయకుమార్, కొండయ్య, నాగ ప్రసన్న, సునీతాబాయ్, కలెక్టరేట్ అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ శివరాముడు, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో శుక్రవారం ఏపీఎఆర్‌ఎస్‌ఏ ఆధ్వ ర్యంలో రెవెన్యూ డేను ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. శిబిరంలో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి లక్ష్మిరాజు, కలెక్టరేట్ అధ్యక్షుడు వెంకట్‌రాజు, విష్ణు, సహారాబాను, లోకేశ్, సునీల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.