బాలికలు విశ్వాసంతో ముందుకు సాగాలి
ABN , Publish Date - May 13 , 2025 | 11:59 PM
బాలికలు విశ్వాసంతో ముందుకు సాగాలని ఐసీడీఎస్ పీడీ నిర్మల సూచించారు. మంగళశారం దేవనకొండ అంగన్‌వాడీ కేంద్రం -1లో కిశోరి వికాసం వేసవి శిక్షణ ప్రణాళిక నిర్వహించారు.
దేవనకొండ, మే 13 (ఆంధ్రజ్యోతి): బాలికలు విశ్వాసంతో ముందుకు సాగాలని ఐసీడీఎస్ పీడీ నిర్మల సూచించారు. మంగళశారం దేవనకొండ అంగన్‌వాడీ కేంద్రం -1లో కిశోరి వికాసం వేసవి శిక్షణ ప్రణాళిక నిర్వహించారు. జిల్లాలోని 1,886 అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలికల మనుగడ, హక్కులు, పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థినులు 3 లక్షలకు పైగా ఉన్నారని అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల్లోపు 15 నుంచి 20 మంది బాలికలను గ్రూపుగా ఏర్పాటు చేసి, అవగాహన కల్పిస్తున్నామ న్నారు. సీడీపీవో మద్దమ్మ, సూపర్‌వైజర్లు శివలింగమ్మ, షాహిన, వెలుగు ఏపీఎం నర్సన్న, టీచర్లు జ్యోతి పాల్గొన్నారు.
వెల్దుర్తి/టౌన్, మే 13 (ఆంధ్రజ్యోతి): బాలలకు తమ హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన ఉండాలని సీడీపీవో లూక్, సూపర్‌వైజర్లు శ్రీదేవి, జయభారతి అన్నారు. సోమవారం వెల్దుర్తి ప్రాజెక్టు రామళ్లకోట సెక్టార్‌లోని పుల్లగుమ్మి అంగన్‌వాడీ కేంద్రాల్లో కిశోరి వికాసం నిర్వహించారు. బాలబాలికలుఉ పనులకు వెళ్లవద్దని, చదువుకుంటే అభివృద్ది, విలువలు తెలుస్తాయన్నారు. ఆపదలో ఉంటే బాలికలు 1098కు కాల్ చేయాలని సూచించారు. దిశా యాప్‌ను మొబైల్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌కే, వెంకటేశ్వరమ్మ, ఏఎన్‌ఎం పార్వతి, అంగన్‌వాడీ టీచర్లు సులోచన, ఆదిలక్ష్మి, శిరీష పాల్గొన్నారు.