పాలిసెట్‌లో బాలికలదే హవా
ABN , Publish Date - May 15 , 2025 | 12:02 AM
పాలిసెట్‌లో బాలికలదే హవా
జిల్లా ఉత్తీర్ణత 94.39 శాతం
కర్నూలు ఎడ్యుకేషన్, మే 14 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో 95.98 శాతం ఉత్తీర్ణత సాధించి బాలికలే పైచేయిగా నిలిచారు. గత నెలలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష జరిగింది. కర్నూలు జిల్లాలో 7,366 మంది పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోగా, 6,442 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో బాలురు 4,947 మంది విద్యార్థులకు గానూ 4,394 మంది హాజరయ్యారు. ఇందులో 553 మంది గైర్హాజర య్యారు. అలాగే బాలికలు 2,419 మంది నమోదు చేసుకోగా, 2,041 మంది పరీక్షకు హాజరయ్యారు. బాలురు 4,395 మందికి గానూ 4,116 మంది అర్హత సాధించి 93.65 శాతం, బాలికలు 2,040 మందికి గానూ 1,958 మంది అర్హత పొంది 95.98 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6,074 మంది ఉత్తీర్ణతతో 94.39 శాతం సాధించారు. ఎస్వీయూ రీజియన్‌లో అనంత తేజశ్విని 117 మార్కులతో 231వ ర్యాంకు, దాసరి శృతి 117 మార్కులతో 250వ ర్యాంకు బండా చంద్రశేఖర్ 116 మార్కులతో 322వ ర్యాంకు సాధించారు.