Share News

గిరిరాజాచార్‌కు పారా విద్యామాన్య అవార్డు

ABN , Publish Date - May 03 , 2025 | 01:13 AM

సంస్కృత విద్యలో ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన రాష్ట్రపతి అవార్డు గ్రహిత విద్వాన రాజా ఎస్‌ గిరిరాజాచార్‌కు ఉడిపి పలిమార్‌ మఠం పీఠాధిపతులు పారా విద్యామాన్య బిరుదును ప్రదానం చేశారు.

గిరిరాజాచార్‌కు పారా విద్యామాన్య అవార్డు
గిరిరాజాచార్‌కు పారా విద్యామాన్య అవార్డు ప్రదానం చేస్తున్న ఉడిపి, పలిమార్‌, రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు

మంత్రాలయం, మే 2 (ఆంధ్రజ్యోతి): సంస్కృత విద్యలో ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన రాష్ట్రపతి అవార్డు గ్రహిత విద్వాన రాజా ఎస్‌ గిరిరాజాచార్‌కు ఉడిపి పలిమార్‌ మఠం పీఠాధిపతులు పారా విద్యామాన్య బిరుదును ప్రదానం చేశారు. శుక్రవారం ఉడిపిలోని మంత్రాలయం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో పాటు పలిమార్‌ మఠం పీఠాధిపతి విద్యాదిశ తీర్థులు, విద్యారాజేశ్వర తీర్థులు అవార్డును ప్రదానం చేశారు. శాలువ, పూలమాల, మెమెంటో, ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. అవార్డు అందుకున్న గిరిరాజాచార్‌కు శ్రీమఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు వెంకటేశ జోషీ, సురేష్‌ కోనాపూర్‌, శ్రీపతాచార్‌, ఐపీ నరసింహమూర్తిలు అభినందనలు తెలిపారు.

Updated Date - May 03 , 2025 | 01:13 AM