పనులు త్వరగా పూర్తి చేయండి
ABN , Publish Date - May 07 , 2025 | 12:13 AM
ఎస్‌ఆర్‌ఎంసీ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ సీఈ కబీర్‌బాషా కాంట్రాక్టర్లను ఆదేశించారు.
నీటిపారుదల శాఖ సీఈ కబీర్ బాషా
జూపాడుబంగ్లా, మే 6(ఆంధ్రజ్యోతి): ఎస్‌ఆర్‌ఎంసీ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ సీఈ కబీర్‌బాషా కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా జరుగుతున్న ఎస్‌ఆర్‌ఎంసీ కాలువ లైనింగ్ పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా ఉండేలా చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం ఆయన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 16 కిలోమీటర్ల పొడవున బానకచర్ల నీటిసముదాయం వరకు పనులను తనిఖీ చేశారు. సీఈ వెంట డీఈ నాగేంద్రకుమార్, ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.