Share News

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధంకండి: ఈవో

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:39 PM

శ్రీశైల మహా క్షేత్రం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలకు ఏర్పాట్లు చేయడానికి ఆలయ విభాగాధిపతులు సిదఽ్ధం కావాలని ఈవో శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధంకండి: ఈవో
సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న ఈవో శ్రీనివాసరావు

వైదిక కమిటీ, అధికారులకు కీలక సూచనలు

యాత్రికుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు

ఫిబ్రవరి 8 నుండి 18 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల మహా క్షేత్రం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలకు ఏర్పాట్లు చేయడానికి ఆలయ విభాగాధిపతులు సిదఽ్ధం కావాలని ఈవో శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు 11 రోజులపాటు జరుగనున్న బ్రహ్మత్సవాల్లో భక్తుల కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకో వాలని సూచిస్తూ శుక్రవారం వైదిక కమిటీతోపాటు ఇంజనీరింగ్‌ అధికా రులు, ఏఈవోలు, పర్యవేక్షకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రంలో రద్దీ పెరు గుతున్నందున గత యేడాదితో పోల్చుకుని మరో 30శాతం వస తుల కల్పన మెరుగుపర్చాలని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం జరిగే కైంకర్యాలను ఆలయ సాంప్రదాయం ప్రకారం సమయపాలన పాటిస్తూ శాస్త్రోక్తంగా నిర్వహించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైదిక కమిటీకి సూచించారు. పాదయాత్ర భక్తుల వసతుల కల్పనకు సంబంధిత శాఖల సమన్వయంతో నెలరోజుల ముందుగానే పనులు పూర్తి చేయాలన్నారు. క్షేత్ర పరిధిలో చలువ పందిళ్లు, శౌచాలయాలు, క్యూలైన్ల మరమ్మతులు, మంచినీటి కుళాయిలు, అల్పాహార పంపిణీ, అన్నప్రసాద భవనాలు, ఉద్యానవనాలు, విద్యుద్దీపాలం కరణ, పుష్పాలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, పార్కింగ్‌, క్లాక్‌రూంలు, సూచిక బోర్డులు, ప్రధాన కూడళ్లలో సహాయ కేంద్రాలు, ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేలా పోలీస్‌శాఖ వారితో కలిసి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్‌కమింగ్‌ అండ్‌ అవుట్‌ గోయింగ్‌ రూట్‌మ్యాప్‌ రూపొందిం చడం, టోయింగ్‌ వాహనాలు, వైద్య శిబిరాలు, అంబులెన్సుల ఏర్పాట్లు, పాతాళగంగ వద్ద రక్షణ కంచ, దుస్తుల మార్చుకునే గదులు, మెట్టమార్గం మరమ్మతుల వంటి మౌలిక వసతుల కల్పనలో రాజీపడకుండా గుత్తేదారులతో నాణ్యమైన పనులు చేయించాలని అన్నారు. ఈ సమావేశంలో ఈఈ నర్సింహారెడ్డి, పీఆర్‌వో శ్రీనివా సరావు, ఎడిటర్‌ అనిల్‌కుమార్‌తో పాటు ఏఈవోలు, డీఈలు, అన్ని విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:39 PM