Share News

బాధితులకు న్యాయం చేయండి: ఎస్పీ

ABN , Publish Date - Jun 21 , 2025 | 11:15 PM

ప్రతి కేసులో నిరూపణ చేసి చిత్తశుద్ధితో పనిచేసి బాధి తులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కోర్టు కానిస్టే బుళ్లపై ఉందని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా పేర్కొ న్నా రు.

బాధితులకు న్యాయం చేయండి: ఎస్పీ
సమీక్షిస్తున్న ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా

నంద్యాల టౌన్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రతి కేసులో నిరూపణ చేసి చిత్తశుద్ధితో పనిచేసి బాధి తులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కోర్టు కానిస్టే బుళ్లపై ఉందని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా పేర్కొ న్నా రు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్టాన్ని అతిక్ర మిం చినవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. నిజయితీగా పని చేసినవారికి ప్రోత్సాహక బహుమ తులు ఇస్తామన్నారు. పెండింగ్‌ కేసుల విషయాలను అడిగి తెసుకున్నారు. కేసు కట్టినవారిపై కేసు విధి విధానాలను సరిగ్గా పాటించి నిరూపణ చేయడంలో వీరి బాధ్యత కీలకమన్నారు. నాన్‌బెయిల్‌ వారెంట్స్‌ పాత పెండింగ్‌ కేసులపై ప్రత్యేకశ్రద్ధ ఉంచి సంబం ధిత వ్యక్తులకు అందించాలన్నారు. పోలీసులు అలస త్వంతో కోర్టులో విచారణ పెండింగ్‌ లేకుండా కోర్టు కానిస్టేబుళ్లు కోర్టు మాటరింగ్‌ సిబ్బంది చర్యలు తీసు కోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీ(స్పెషల్‌ బ్రాంచ్‌) సీఐ మోహన్‌రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 11:15 PM