Share News

హంద్రీకి జీడీపీ నీరు విడుదల

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:04 PM

గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి మంగళవారం మధ్యాహ్నం హంద్రీ నదికి నీరు విడుదల చేశారు.

హంద్రీకి జీడీపీ నీరు విడుదల
జీడీపీ నాలుగో గేటు ద్వారా విడుదలవుతున్న నీరు

నాలుగో గే టు ఎత్తి 500 క్యూసెక్కులు..

గోనెగండ్ల, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి మంగళవారం మధ్యాహ్నం హంద్రీ నదికి నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు నాలుగో గేటు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ మహమ్మద్‌ ఆలీ తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రాజె క్టుకు వరదనీరు చేరడంతో గేటు మూసి వేశామని, అయితే సోమవారం సాయంత్రం నుంచి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, దేవనకొండ తదితర ప్రాంతాలలో ఒక మోస్తారు వర్షం కురియడంతో మంగళవారం మధ్యాహ్నానికి వరద నీరు వచ్చి చేరిం దన్నారు. దీంతో ప్రస్తుతం గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రానికి నీటి మట్టం 376.88 మీటర్లు ఉందన్నారు. దీంతో జీడీపీ నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 377 మీటర్లు అయితే ప్రస్తుతం కేవలం 0.12 మీటర్లు మాత్రమే తక్కువ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రాజెక్టులో నీరు సామర్థ్యానికి తగ్గట్టుగా ఉందని, ఇకపై ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తామని అధికారులు వివరించారు. ఫలితంగా రబీ సీజన్‌లో ఆయకట్టు రైతులకు నీటి కొరత లేకుండా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:04 PM