హంద్రీకి జీడీపీ నీరు
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:23 PM
: గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి హంద్రీ నదికి గురువారం కూడా నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు 4వ గేటు ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని హంద్రీనదికి విడుదల చేసినట్లు ఏఈ మహుమ్మద్ ఆలీ తెలిపారు.
4వ గే టు ఎత్తి 300 క్యూసెక్కులు విడుదల
గోనెగండ్ల, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి హంద్రీ నదికి గురువారం కూడా నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు 4వ గేటు ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని హంద్రీనదికి విడుదల చేసినట్లు ఏఈ మహుమ్మద్ ఆలీ తెలిపారు. ఈ నెల 19, 20 తేదీలలో తుఫాన్ రానున్నట్లు వాతావరణశాఖ సమాచారం ఇవ్వడంతో ముందస్తుగా జీడీపీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, దేవనకొండ తదితర ప్రాంతాలలో అడపదడపా కురుస్తున్న వర్షాల కారణంగా హంద్రీ నుంచి అరకొరగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం గాజలదిన్నె ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రానికి నీటి మట్టం(3.9 టీఎంసీ) 375 మీటర్లు ఉంది. దీంతో జీడీపీ నిండు కుండలా మారింది. జీడీపీ పూర్తిస్థాయి నీటి మట్టం 377 మీటర్లు అయితే ప్రస్తుతం కేవలం 2 మీటర్ల మాత్రమే తక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో నీరు సామర్థ్యానికి తగ్గట్టుగా పూర్తిగా ఉందని ఇప్పటి నుంచి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.