Share News

హంద్రీకి జీడీపీ నీరు

ABN , Publish Date - Sep 27 , 2025 | 10:58 PM

గాజులదిన్నె ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా కుండపోత వర్షం కురియడంతో జీడీపీకి వరద నీరు వచ్చి చేరుతోంది.

హంద్రీకి జీడీపీ నీరు
జీడీపీ నుంచి విడుదలవుతున్న నీరు

4,5 గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కులు విడుదల

గోనెగండ్ల, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా కుండపోత వర్షం కురియడంతో జీడీపీకి వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం ఉదయం 4, 5, గేట్లను ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని హంద్రీనదికి విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 20వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రావడంతో ఉదయం పది గంటలకు రెండు గేట్ల ద్వారా 18వేల క్యూసె క్కులను హంద్రీ నదికి విడుదల చేసినట్లు జీడీపీ ఏఈ మహమ్మద్‌ ఆలీ తెలిపారు. శనివారం రాత్రికి ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. ప్రస్తుతం 376.88 మీటర్లు (4.2 టీఎంసీ) వరకు నీటిని నిల్వ ఉంచాలని అధికారులు నిర్ణయిం చారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన మద్దికెర, పత్తికొండ, ఆస్పరి, తుగ్గలి ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షాలు కురి యడంతో వరద వచ్చి జీడీపీని చేరింది. ప్రాజెక్టులో నీరు సామర్థ్యానికి తగ్గట్టుగా నీరు నిల్వ చేసి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. రబీ సీజన్‌లో జీడీపీ ఆయకట్టు రైతులకు నీటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 27 , 2025 | 10:58 PM