Share News

గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలి

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:56 PM

పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండు చేశా రు.

గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలి
సిలిండర్‌తో ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

నంద్యాల రూరల్‌ ఏప్రిల్‌ 10 ( ఆంధ్రజ్యోతి): పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండు చేశా రు. గురువారం స్థానిక సంజీవనగర్‌లో సిలిండర్‌లో ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్యాస్‌పై రూ.50, పెట్రోల్‌పై రూ.2 పెంచి పేదలపై భారం మోపడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాబా ఫకృద్దీన్‌, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, శ్రీనివాసులు, మహిళా సమాఖ్య కన్వీనర్‌ సుశీలమ్మ పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:56 PM