Share News

ఘనంగా గరుడోత్సవం

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:31 AM

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం.. సకల కార్యకారణ స్వరూపుడై సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేస్తూ ఎగువ అహోబిల క్షేత్రంలో అవతరిం చిన ఉగ్ర నారసింహుడి గరుడ ఉత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.

ఘనంగా గరుడోత్సవం
ఎగువలో గరుడ వాహనంపై కొలువై మాడవీధుల్లో విహరిస్తున్న జ్వాలా నరసింహస్వామి

‘ఎగువ’లో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

దిగువ అహోబిలంలో తీర్థవాది

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం.. సకల కార్యకారణ స్వరూపుడై సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేస్తూ ఎగువ అహోబిల క్షేత్రంలో అవతరిం చిన ఉగ్ర నారసింహుడి గరుడ ఉత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవీ, భూదేవీ సమేత జ్వాలా నరసింహస్వామి ఉత్సవమూర్తులను పటు ్టపీతాంభరాలు, పూలమాలలతో శోభాయ మానం గా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. విశేషా లంకరణ చేసిన గరుడ వాహనంపై జ్వాలా నర సింహస్వామిని కొలువు ఉంచి వైభవంగా గరుడ సేవ నిర్వహించారు. ఎగువలో ఈ రమణీయ వేడుక శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు జరిగింది. బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా ఆలయ అర్చకులు ధ్వజావరోహణం చేపట్టారు. బ్రహ్మోత్సవాలకు రావాలని సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజ స్తంభంపై ఆవిష్కరించిన పటాన్ని శాస్త్రోక్తంగా అవరోహణం చేశారు. దీంతో ఎగువ అహోబిలంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు.

భక్తిశ్రద్ధలతో ద్వాదశ ఆరాధన : అహోబిలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో ఉభయ దేవేరులతో కొలువైన ప్రహ్లాదవరదస్వామికి భక్తిశ్రద్ధలతో ద్వాదశ ఆరాధన నిర్వహించారు. ఆరాధన దోషాలను నివృత్తి చేసుకోవడం కోసం తిరువారాధన చేసి స్వామి, అమ్మవార్లకు అర్చకులు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఉభయదేవేరులతో కొలువైన ప్రహ్లాదవరదస్వామి ఉత్సవమూర్తులకు కన్నులపండువగా పుష్పయాగం నిర్వహించారు.

‘దిగువ’లో తీర్థవాది, చక్రస్నానం

దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు శనివారం ఉదయం శాస్త్రోక్తంగా తీర్థవాది, చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీదేవీ, భూదేవీ సమేత ప్రహ్లాదవరదస్వామి ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం, నవకలశ తిరుమంజనం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఉత్సవం నిర్వహించారు. అనంతరం కోనేరులో సుదర్శనమూర్తికి చక్రస్నానం చేయించారు. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌, ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్‌, మణియార్‌ సౌమ్యనారాయణన్‌ వేడుకలను పర్యవేక్షించారు.

Updated Date - Mar 16 , 2025 | 12:31 AM