చెత్త తరలింపు అడ్డగింత
ABN , Publish Date - Oct 11 , 2025 | 10:40 PM
ఆత్మకూరు నుంచి చెత్తను లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ చేసేందుకు నందికొ ట్కూరుకు తరలిస్తుండగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు అడ్డుకు న్నారు.
లారీలు పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
లెగసీ వేస్ట్‌ను ప్రాసెసింగ్ చేయడంతో సమస్యలు
మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి
నందికొట్కూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు నుంచి చెత్తను లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ చేసేందుకు నందికొ ట్కూరుకు తరలిస్తుండగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు అడ్డుకు న్నారు. లారీల ద్వారా తరలిస్తున్న చెత్త వల్ల దుర్వాసన, దుమ్ము వస్తోందని బ్రహ్మంగారి మఠం సమీపంలోని కాలనీ వాసులు, కౌన్సిలర్ చాంద్‌బాషా శనివారం వాహనాలను నిలిపేశారు. మున్సి పల్ ఛైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి అక్కడి చేరుకొని సమ స్యను తెలుసుకొని వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు డంప్ యార్డులోని లెగసీ వేస్ట్‌ను ప్రాసెసింగ్ చేయడం వల్ల దుమ్ము సమీపంలోని కాలనీల్లోకి వస్తుందని, ప్రజలు ఇబ్బందులకు గురవుతా రన్నారు. పట్టణానికి దూరంగా ఈ ప్రాసెసింగ్‌ను ఏర్పాటు చేసుకొని ఇక్కడి చెత్తతో పాటు ఆత్మకూరు డంప్ యార్డులోని చెత్తను కూడా అక్కడే ప్రాసెసింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవా లన్నారు. సీపీఎం నాయకులు పక్కీర్ సాహెబ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
19,700 టన్నుల చెత్తను రీసైక్లింగ్
నందికొట్కూరు డంప్ యార్డులో 19,700 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం గుత్తేదారులను ఆహ్వానించిందన్నారు. నందికొట్కూరులోని 19,700 టన్ను ల చెత్తతో పాటు, ఆత్మకూరులో 3వేల టన్నుల చెత్తను నందికొట్కూరు డంప్ యార్డులోనే ప్రాసెసింగ్ చేసేందుకు గుత్తేదారు టెండర్ దక్కించుకున్నారు. దీంతో నం దికొట్కూరు డంప్ యార్డులోని చెత్తను ఒక చోటికి తరలించడంతో పాటు ఆత్మకూరు డంప్ యార్డులో ఉన్న దాదాపు 2,500 టన్నుల చెత్తను ఇక్కడి తరలించినట్లు తెలు స్తోంది. ప్రాసెసింగ్ చేసేందుకు గుత్తేదారు సిద్ధంగా ఉన్నారు.