Share News

విద్యతోనే భవిష్యత్‌

ABN , Publish Date - May 04 , 2025 | 11:45 PM

విద్యతోనే భవిష్యత్‌ సాధ్యమని కర్నూలు పంచాయతీ రాజ్‌ డీఈఈ హరిదాసు ఈరన్న, ఇరిగేషన్‌ డీఈ కృష్ణనాయక్‌ అన్నారు.

విద్యతోనే భవిష్యత్‌
ప్రతిభ కనపరచిన విద్యార్థులతో సభ్యులు

బుగ్గతండాలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో అవగాహన.. విద్యార్థులకు బహుమతులు

పత్తికొండ, మే 4(ఆంధ్రజ్యోతి): విద్యతోనే భవిష్యత్‌ సాధ్యమని కర్నూలు పంచాయతీ రాజ్‌ డీఈఈ హరిదాసు ఈరన్న, ఇరిగేషన్‌ డీఈ కృష్ణనాయక్‌ అన్నారు. ఆదివారం మండలంలోని బుగ్గతండాలో జిల్లా గిరిజన సంఘం ఆధ్వ ర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ముందుగా అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం పహల్గామ్‌ ఉగ్రదాడిలో చనిపోయిన 28 మంది భారతీయులకు సంతాపం తెలిపారు. వారు మాట్లాడుతూ ఒకప్పుడు గిరిజన తండాలో చదువుకోవడానికి విద్యార్థులు ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పించిందన్నారు. విద్యార్థులు చదువులో ప్రతిభ చూపి ఉన్నత శిఖరాలు అధిరో హించాలని సూచించారు. ప్రతిభ చూపి న వారికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తా యన్నారు. అనం తరం పదో తరగతి, ఇంటర్మీడీయట్‌లో ప్రతిభ కనబరచిన గిరిజన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో యువస్పందన సొసైటీ సెక్రటరీ నాగరాజు, ఉపాధ్యాయులు లోక్యనాయక్‌, రంగస్వామి నాయక్‌, వెంకటేశ్‌ నాయక్‌, ఏఈఈ రంగనాయక్‌, స్వామినాయక్‌, వేల్ఫేర్‌ అసిస్టెంట్‌ వెంకటరమణ, ఉపసర్పంచ్‌ జ్యోతి, గ్రామపెద్దలు గోద్రెనాయక్‌, దానానాయక్‌, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 11:45 PM