ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేయాలి
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:23 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బకాయి పడిన రూ.2,700 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను తక్షణమే విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్ డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌ్‌సదేశాయ్
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బకాయి పడిన రూ.2,700 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను తక్షణమే విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్ డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా గౌస్‌దేశాయ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదన్నారు. నరేంద్ర మోదీ మెప్పు కోసం జీఎస్టీ సంబరాల పేరనుతో రూ.వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ బకాయిలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిం చారు. ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళనలు చేస్తా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి టి.రాముడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆనంద్‌బాబు, రామక్రిష్ణ, అరుణమ్మ, పాతబస్తీ కార్యదర్శి రాజశేఖర్, విజయ్, సుధాకరప్ప తదితరులు పాల్గొన్నారు.