జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:02 AM
కూటమి ప్రభుత్వంలో జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.పదివేల కోట్ల నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్ యాదవ్ అన్నారు.

కోసిగి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.పదివేల కోట్ల నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్ యాదవ్ అన్నారు. సోమవారం కోసిగిలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ రుద్రగౌడుకు అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, జిల్లా సమగ్రా భివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గోపాల్, డీహెచపీఎస్ మండల అధ్యక్షుడు ఓంకార్ స్వామి, ఏఐవైఎప్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్, రైతులు తాయన్న, పరుశురాముడు, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.