Share News

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మరమ్మతుకు నిధులు

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:00 AM

నాగటూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మోటార్‌ మరమ్మతు పనులకు రూ.38 లక్షల నిధులను కలెక్టర్‌ రాజకుమారి విడుదల చేశారు.

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మరమ్మతుకు నిధులు
నంద్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

రూ.38 లక్షలు మంజూరు చేశామన్న కలెక్టర్‌

నందికొట్కూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నాగటూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మోటార్‌ మరమ్మతు పనులకు రూ.38 లక్షల నిధులను కలెక్టర్‌ రాజకుమారి విడుదల చేశారు. సోమవారం నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తీసుకెళ్లారు. రబీ సీజన్‌ ప్రారంభం అయ్యిందని నాగటూరు ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగు నీరు అందించాల్సి ఉందన్నారు. గత కొంత కాలంగా నాగటూరు ఎత్తిపోతల పథకం విద్యుత్‌ మోటార్లు మరమ్మతులు రావడంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మోటారు మరమ్మతులకు నిధులు కేటాయించాలని కలెక్టర్‌ను గతంలోనే కోరారు. దీంతో కలెక్టర్‌ రాజకుమారి నాగటూరు ఎత్తిపోతల పథకం విద్యుత్‌ మోటార్ల మరమ్మతులకు రూ.38 లక్షల నిధులను కేటాయించారు. నిధులను కేటాయించినందుకు ఎమ్మెల్యే కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలాల కన్వీనర్లు పలుచాని మహేశ్వరరెడ్డి, గుండ్రెడ్డి మోహన్‌రెడ్డి, షమీం, చిన్నయ్య, ఖాదర్‌, మల్లికార్జున్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి,

Updated Date - Nov 25 , 2025 | 12:00 AM