Share News

ఎత్తిపోతల పథకాలకు నిధులివ్వండి

ABN , Publish Date - Jun 19 , 2025 | 11:17 PM

కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని వెంటాడుతున్న కరువు, వలసల నివారణ లక్ష్యంగా చేపట్టిన ఎత్తిపోతల పథకాలను నిధులివ్వాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సీఎం చంద్రబాబును కోరారు.

ఎత్తిపోతల పథకాలకు నిధులివ్వండి
సీఎం చంద్రబాబును కలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, చిత్రంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లయ్య చౌదరి

సీఎం చంద్రబాబుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వినతి

జిల్లా పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చ

కర్నూలు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని వెంటాడుతున్న కరువు, వలసల నివారణ లక్ష్యంగా చేపట్టిన ఎత్తిపోతల పథకాలను నిధులివ్వాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. గురువారం అమరావతిలో అధినేత చంద్రబాబును కలసి జిల్లాలో టీడీపీ సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. పార్టీ బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాల నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో.. కాపలా లేక అంతర్రాష్ట్ర దొంగల మూఠా ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లో కాపర్‌ తీగ, కీలకమైన పరికరాలను దోచుకెళ్లారని వివరించారు. వాటి మర మ్మతులకు, 2018లో నాటి టీడీపీ ప్రభు త్వంలో చేపట్టిన హల్వి-గోతులదొడ్డి, ఐరన్‌గల్‌, బస్సాపురం, మంత్రాలయం-1 ఎత్తిపో తలకు నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. అందుకు సంబంధిం చిన సమగ్ర వివరాల నివేదికలను చంద్రబాబుకు అందజేశారు. సీఎం సానుకూలంగా స్పందిం చారని తిక్కారెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి వివరిం చారు. సీఎంను కలసిన వారిలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లయ్యచౌదరి ఉన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:17 PM