Share News

ఇక నుంచి కర్నూలులోనే వైద్యుల రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:09 AM

ఉమ్మడి జిల్లాలోని వైద్యుల రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌, ఇతర సేవలు కర్నూలులోనే అందనున్నాయి.

ఇక నుంచి కర్నూలులోనే వైద్యుల రిజిస్ట్రేషన్‌
కర్నూలు మెడికల్‌ కళాశాలలో వైద్యుల రిజిస్ట్రేషన్‌ యూనిట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి టీజీ భరత్‌

యూనిట్‌ను ప్రారంభించిన మంత్రి టీజీ భరత్‌

కర్నూలు హాస్పిటల్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని వైద్యుల రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌, ఇతర సేవలు కర్నూలులోనే అందనున్నాయి. శనివారం వైద్యుల రిజిస్ట్రేషన్‌ యూనిట్‌ను కర్నూలు మెడికల్‌ కాలేజీలో పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ ఎల్లప్పుడూ ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో 500 సర్వీసులతో వాట్సాప్‌ గవర్నెన్స్‌ను అభివృద్ధి చేశారన్నారు. మన రాష్ట్రంలో ఉన్న వైద్యులు వారి సర్టిఫి కెట్లు రిజిస్ట్రేషన్లు, రీ-రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలు ఎక్కడి కక్కడ జిల్లాలో చేయించుకునే ఏర్పాట్లు చేసినట్లు తెలి పారు. గతంలో డాక్టర్లు రిజిస్ట్రేషన్ల కోసం విజయవాడకు వెళ్లాల్సి వచ్చేదని, ఏవైనా సర్టిఫికెట్లు తక్కువైతే వెనక్కి రావడం చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, 60ఏళ్లు పైబడిన డాక్టర్లకు ఇంకా కష్టంగా ఉంటుందని అన్నారు. ఈ కష్టాల నుంచి డాక్టర్లను విముక్తి చేసేందుకు కర్నూలులోనే రిజిస్ర్టేషన్‌ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారఽథి మాట్లాడుతూ చాలా మంది వైద్యులు రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ చేయించుకోకుండా ప్రాక్టీసులో ఉంటారని, దీనివల్ల వారి వైద్య వృత్తికి ఇబ్బందులు కలుగుతాయని అన్నారు. ఇప్పుడు విజయవాడకు వెళ్లకుండా కర్నూలులోనే రెన్యువల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ దగ్గుబాటి శ్రీహరిరావు మాట్లాడుతూ జిల్లా స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ చేయించే సేవలను తీసుకుని వచ్చామని ప్రతి శని, ఆదివారాల్లో ఈ కార్యక్రమాలు చేపడుతామన్నారు. గతంలో 40వేల నుంచి 50వేల వరకు ఉండే రీ రిజిస్ట్రేషన్‌ను ఇప్పుడు 75ఏళ్లు పైన ఉన్న వారికి రూ.6వేలు, 75 ఏళ్లలోపు ఉన్న వారికి రూ.8వేలు రిజిస్ర్టేషన్‌ చేయనున్నట్లు తెలిపారు. ఐదేళ్ల కంటే మూడు నెలల ముందుగా రెన్యువల్‌ చేసుకోవచ్చన్నారు. కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. చిట్టినరసమ్మ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కె.వెంకటేశ్వర్లు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సాయిసుధీర్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి. శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:09 AM