Share News

విధ్వంసం నుంచి వికాసం వైపు..

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:30 AM

సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపుగా నడిపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి మీనాక్షినాయుడు, పరిశీలకుడు ధర్మవరపు సుబ్బారెడ్డి అన్నారు

విధ్వంసం నుంచి వికాసం వైపు..
మాట్లాడుతున్న పరిశీలకుడు సుబ్బారెడ్డి

మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ధర్మవరం సుబ్బారెడ్డి

ఆదోని, జూలై3(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపుగా నడిపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి మీనాక్షినాయుడు, పరిశీలకుడు ధర్మవరపు సుబ్బారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఒకటో వార్డులో సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అభి వృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో పనిచేస్తు న్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీలేదని ఆరోపించారు. కౌన్సి లర్‌ పార్వతి, కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప, భాస్కర్‌రెడ్డి, భూపాల్‌చౌదరి, మారుతినాయుడు, శ్రీకాంత్‌రెడ్డి, వాల్మీకి వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:30 AM