15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:16 PM
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బసుస ప్రయాణ వసతి ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈనెల 15వ తేదీ నుంచి అమలులోకి వస్తోందని, మహిళలు ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రమంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు.
ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించొచ్చు
ఏపీఎస్ ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు
ఆదోని, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బసుస ప్రయాణ వసతి ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈనెల 15వ తేదీ నుంచి అమలులోకి వస్తోందని, మహిళలు ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రమంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు. ఆదోని బస్ స్టేషన్‌ను శుక్రవారం సందర్శించి ప్రయాణికులతో నేరుగా మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు సంతోషం వ్యక్తంచేశారు. బస్ స్టేషన్‌లో ఉన్న సౌకర్యాలను నాగరాజు పరిశీలించి, రద్దీని దృష్టిలో ఉంచు కుని తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, విద్యార్థినులు ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను చూపించి పల్లె వెలుగు, అల్ర్టా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఆదోని ఆర్టీసీ బస్టాండుకు ఇరువైపులా కాంపౌండ్ కోసం ప్రతిపాదనలు పంపిం చాలని, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డీఎంకు సూచించారు. డిపో గ్యారేజ్ సందర్శనలో సిబ్బంది, పారిశుధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బస్సుల ఫిట్‌నెస్‌పై నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. బస్ స్టేషన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణకు సూచించారు. కార్యక్ర మంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటచౌదరి, యువ నాయకులు మారుతినాయుడు, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస ఆచారి, డిపో మేనేజర్ రఫిక్ పాల్గొన్నారు.