Share News

మహిళలకు ఉచిత ప్రయాణం

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:17 AM

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం శుక్రవారం ప్రారంభమైంది.

మహిళలకు ఉచిత ప్రయాణం
నంద్యాలలో ప్రారంభిస్తున్న మంత్రి బీసీ, కలెక్టర్‌ రాజకుమారి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫీరోజ్‌

ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

నంద్యాల, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం శుక్రవారం ప్రారంభమైంది. ఈ పథ కాన్ని జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభిం చారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజకుమారి, ఆర్టీసీ ఆర్‌ఎం రజియా సుల్తానా, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫరూక్‌ హా జరై ప్రారంభించారు. ఆత్మకూరు ఆర్టీసీ డీపోలో ఆర్డీవో నాగజ్యోతి కూటమి నాయకులు చేతులు మీదుగా ప్రారంభించారు. నంది కొట్కూరు బస్టాండ్‌లో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మహేష్‌నాయుడు జెండా ఊపీ ప్రారంభించి మహిళలకు జాకెట్‌లను పంపిణీ చేశారు. డోన్‌లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రారంభించి మహిళలతో కలిసి ప్రయాణం చేశారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో పలు ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించడంతో ఆర్టీసీ ప్రాంగణాలు మహిళలతో నిండిపోయింది. ఎంతో ఉత్సాహంగా మహిళలు, ప్రజాప్రతినిధులతో ఆర్టీసీ బస్టాండ్‌లో సందడిగా మారింది.

Updated Date - Aug 16 , 2025 | 12:17 AM