ఉచితం మాటున దోపిడీ
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:28 AM
సామాన్యులకు, ఇళ్లు నిర్మించుకునే పేదలకు ఇసుక అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ఆసరగా తీసుకొని కొందరు అక్రమార్కులు గంజహళ్లి దగ్గర ఉన్న హంద్రీ నదిని తోడేస్తున్నారు
అంతులేని ఇసుక అక్రమార్కుల ఆగడాలు
పోలీసులు వచ్చే లోపు పలాయనం
హంద్రీ నదిని తోడేస్తున్న వైనం
గోనెగండ్ల, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): సామాన్యులకు, ఇళ్లు నిర్మించుకునే పేదలకు ఇసుక అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ఆసరగా తీసుకొని కొందరు అక్రమార్కులు గంజహళ్లి దగ్గర ఉన్న హంద్రీ నదిని తోడేస్తున్నారు. ఒక ట్రిప్పు ఇసుక ట్రాక్టర్ రూ.4,000 నుంచి రూ.5,000 వరకు అమ్ము తున్నారు. దూరాన్నిబట్టి రేటు పెంచుతున్నట్లు తెలుస్తోంది. గంజహళ్లి నుంచి ఆదోని, అరెకల్లు, బిల్లెకల్లు, దేవిబెట్ట, ఎమ్మిగనూరు, గోనెగండ్ల ప్రాంతాలకు అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. శనివారం కొందరు ఇసుక అక్రమ వ్యాపారులు ట్రాక్టర్‌లో ఇసుకను తరిస్తు న్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు గంజ హళ్లి హంద్రీ నదికి వెళ్లే లోపే అక్కడ నుంచి ట్రాక్టర్‌లతో ఇసు కను తరలించుకు పోయారు. ఇసుక వ్యాపారులు రోజుకు 30 నుంచి 40 ట్రాక్టర్ మేర ఇసుక తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక ట్రాక్టర్లు నిరంతరంగా హంద్రీ నదికి వెళుతుండటంతో తమ పొలాలకు వెళ్లే దారి దెబ్బ తింటుందని గంజహళ్లి గ్రామ రైతులు బోరుమంటున్నారు. అలాగే చోటా మోటా నాయకుల చేతివాటానికి అడ్డులేకుండా పోయింది. గంజహళ్లి నుంచి అక్రమంగా ప్రతి రోజూ 30 నుంచి 40 ట్రిప్పులకు పైగానే ఇసుకకు తర లిస్తున్నట్లు తెలుస్తోంది. హంద్రీ నదిలోని ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటి పోయి వచ్చే వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య వస్తుందని గ్రామస్థులు తెలుపుతున్నారు.
విచారించి కేసు నమోదు చేస్తాం
ంజహళ్లి గ్రామ హంద్రీ నది నుంచి శనివారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులను సంఘటన స్థలానికి పంపాం. అక్కడ నుంచి ఇసుకను అక్రమంగా కొందరు వ్యక్తులు ట్రాక్టర్‌తో తరలించుకుపోయినట్లు తెలిసింది. ఎవరు తరలించుకుపోయిందీ విచారించి కేసు నమోదు చేస్తాం. చిరంజీవి, ఇన్‌చార్జి సీఐ, గోనెగండ్ల