ఖైదీలకు ఉచిత న్యాయసేవలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:26 PM
జైలులో ఉన్న ఖైదీలకు ఉచితంగా న్యాయ సేవలు పొందేందుకు న్యాయవాదిని నియమించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి
ఆదోని, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జైలులో ఉన్న ఖైదీలకు ఉచితంగా న్యాయ సేవలు పొందేందుకు న్యాయవాదిని నియమించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి తెలిపారు. గురువారం ఆయన ఆదోని సబ్‌జైలును తనిఖీ చేశారు. ముందుగా జైలు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఖైదీల యోగక్షేమాలు, ఆహార సరఫరా, వైద్య సదుపాయలు అడిగి తెలుగుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖైదీలందరికీ ఉచిత న్యాయవాది కల్పించే వెసులుబాటు ఉందన్నారు. కోర్టు ప్రాంగణంలో నిర్మితమవుతున్న నూతన కోర్టు భవనాన్ని పరిశీలించారు. కోర్టు నిర్మాణంతో ఇబ్బందులు పడుతున్నాయని, త్వరగా పూర్తిచేయాలని న్యాయవాదులు విన్నవించారు. ఏడాదిలోగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా న్యాయాధికారి పి.జె.సుధ, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ లీలా వెంకటశేషాద్రి, సీనియర్ సివిల్ న్యాయాధికారి యజ్ఞనా రాయణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారులు అర్చన, డాక్టర్ విష్ణు, జైలు సూపరిం టెండెంట్ నజీర్‌అహ్మద్, లీగల్ ఎయిడ్ న్యాయవాది సి.ఆనంద్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.