కర్నూలులో మరో నాలుగు కొవిడ్ కేసులు
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:24 PM
ఒకే రోజు నాలుగు కొవిడ్ కేసులు గురువా రం నమోదయ్యాయి. బుధవారం ఆరు మంది అనుమానిత రోగులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, అందులో నలుగురికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇద్దరికి నెగిటివ్ వచ్చింది.
కర్నూలు హాస్పిటల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ఒకే రోజు నాలుగు కొవిడ్ కేసులు గురువా రం నమోదయ్యాయి. బుధవారం ఆరు మంది అనుమానిత రోగులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, అందులో నలుగురికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడుకు చెందిన 25 ఏళ్ల మహిళ, అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలం ఏ.తిమ్మాపురం చెందిన 49 ఏళ్ల ఓ వ్యక్తికి, గోనెగండ్ల మండలం లింగందిన్నెకు చెందిన 45ఏళ్ల వ్యక్తి, కర్నూలు నగరానికి చెం దిన 20 ఏళ్ల ఓయువతికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. ఇందులో లింగందిన్నె, అనంతపురం జిల్లాకు చెందిన కొవిడ్ రోగులు కర్నూలు జీజీహెచ్‌లోని ఎంఎం-5లో, దిన్నెదేవరపాడు చెందిన రోగి ఎఫ్‌ఎం-3, కర్నూలుకు చెందిన 20ఏళ్ల యువతి కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నారు. కొవిడ్ రోగులను సాధారణ వార్డులోనే ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో నాలుగు కొవిడ్ కేసులు వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.