కంబి యాత్రా నివాస్‌కు శంకుస్థాపన
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:10 PM
శ్రీశైల క్షేత్రంలో కర్నాటక భక్తులతోపాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు బస చేసేందుకు ఆధునిక సౌకర్యాలతో సుమారు రూ. 200 కోట్ల నిధులతో నిర్మించే కంబి యాత్రా నివాస్‌కు శంకుస్థాపన చేశారు.
రూ. 200 కోట్లతో వసతి గదులు
త్వరలో కృష్ణగిరి నుండి శ్రీగిరికి రోప్ వే
ఎమ్మెల్యే బుడ్డా
శ్రీశైలం నవంబర్ 13 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో కర్నాటక భక్తులతోపాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు బస చేసేందుకు ఆధునిక సౌకర్యాలతో సుమారు రూ. 200 కోట్ల నిధులతో నిర్మించే కంబి యాత్రా నివాస్‌కు శంకుస్థాపన చేశారు. గురువారం శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆలయ ఛైర్మెన్ పోతుగుంట రమేష్‌నాయుడు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజురోజుకూ శ్రీశైలానికి వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ వసతి గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని చెప్పారు. అదే విధంగా కృష్ణగిరి నుండి శ్రీగిరికి రోప్‌వే పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలిపారు. క్షేత్ర పరిధిలోని దేవదాయశాఖ, అటవీశాఖ మధ్య ఉండే సమస్యలు తొలగిపోయి మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రీశైల మండల ఇన్‌చార్జ్ యుగంధర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.