Share News

జీజీహెచ్‌లో సీసీయూకు శంకుస్థాపన

ABN , Publish Date - Oct 17 , 2025 | 10:58 PM

నంద్యాల జీజీహెచ్‌లో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు శుక్రవారం రాష్ట్ర మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ శంకుస్థాపన చేశారు.

జీజీహెచ్‌లో సీసీయూకు శంకుస్థాపన
జీజీహెచ్‌లో భూమిపూజ చేస్తున్న మంత్రి ఫరూక్‌

రూ.23కోట్లతో అత్యాధునిక వసతులతో భవన నిర్మాణం

నంద్యాల హాస్పిటల్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జీజీహెచ్‌లో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు శుక్రవారం రాష్ట్ర మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టెంకాయకొట్టి భూమిపూజ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా జీజీహెచ్‌లో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. రోగులు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. రూ.23కోట్లతో క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎన్‌ఎండి ఫిరోజ్‌, నంద్యాల మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ సురేఖ, జీజీహెచ్‌ డిప్యూటి సూపరింటెండెంట్‌ జిలాని, డాక్టర్‌ సోహైల్‌, ఆర్‌ఎంఓ వెంకటేష్‌, కౌన్సిలర్లు శ్యాంసుందర్‌, శ్రీదేవి, జైనాబీ, మాజీ కౌన్సిలర్‌ శివశంకర్‌, పబ్బతివేణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 10:58 PM