భవిష్యత్తుకు పునాది పాఠశాలలోనే..
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:26 AM
విద్యార్థుల భవిష్యత్తుకు పునాది పాఠశాలలోనే పడుతుందని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ పేర్కొన్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు శుక్రవారం నగర శివారులోని రాఘవేంద్ర బీఈడీ కళాశాలలో శిక్షణను ప్రారంభించారు.
విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు,
ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్
కర్నూలు, నంద్యాలలో నూతన ఉపాధ్యాయులకు శిక్షణ
కర్నూలు ఎడ్యుకేషన్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్తుకు పునాది పాఠశాలలోనే పడుతుందని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ పేర్కొన్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు శుక్రవారం నగర శివారులోని రాఘవేంద్ర బీఈడీ కళాశాలలో శిక్షణను ప్రారంభించారు. శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విలువలతో కూడిన బోధనతో నవసమాజాన్ని నిర్మించాలని కోరారు. ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దాలిం్సన బాధ్యత మనపై ఉందన్నారు. డీఈవో శామ్యూల్ పాల్ మాట్లాడుతూ జిల్లాలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దాదాపు అన్ని పోస్టులు భర్తీ చేయగలిగామని తెలిపారు. రిసోర్స్‌పర్సన్లు చెప్పే విషయాలను రాసుకుని అమలు చేయాలని కోరారు.
ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలి : డీఈవో
పాణ్యం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాలని డీఈవో జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం విజయానికేతన్ పాఠశాలలో మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. వి ద్యార్థులకు పునాదిలోనే క్రమశిక్షణతో కూడుకున్న చదువునందించాలన్నారు. ఈరోజునుంచి ఉపాధ్యాయులకు కొత్త జీవితం ప్రారంభమవుతుందని అన్నారు. కుటుంబ సమస్యలను అధిగమించి వృత్తికి న్యాయం చేయాలని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో 1,030 మంది ఉపాధ్యాయులకు ఈనెల 10 తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నూలులో శిక్షణకు అనుకూలంగా లేకపోవడంతో అనంతపురంలో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2,600ల మంది శిక్షకులు పాల్గొంటారన్నారు. శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులు వచ్చే నెల విజయవాడలో నిర్వహించే శిక్షణలో పాల్గొనాలన్నారు. శిక్షణలో పాల్గొనని ఉపాధ్యాయులకు ఆర్డర్ కాపీ ఇవ్వమన్నారు. శిక్షణలో పాల్గొన్న వారికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. పాణ్యంలో 450 మంది శిక్షణలో పాల్గొంటున్నట్లు తెలిపారు. శిక్షణా కేంద్రాలలో వైద్య సహాయం, అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోర్స్ డైరెక్టర్లు కోటయ్య, వెంకటేశ్వరరెడ్డి, ఎంఈవో సుబ్రహ్మణ్యం, అలెస్కో సభ్యులు ప్రసన్నకుమార్, విజయానికేతన్ కరస్పాం డెంట్ సంధ్యారాణి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.