Share News

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:39 PM

కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ

కర్నూలు రూరల్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఆదివారం విజయవాడలోని ఆ పార్టీ కేంద్ర కార్యలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి బీజేపీ కండువా కప్పి మురళీకృష్ణను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత వైఎస్‌ జగనోహ్మన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. కోడుమూరు అసెంబ్లీ టికెట్‌ రాకపోవడంతో కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన మురళీ వారానికే మళ్లీ తిరిగి వైసీపీలో చేరి టీటీడీ పాలకమండలి సభ్యులుగా పదవి తెచ్చుకున్నారు. మురళీకృష్ణకు రెండో సారి కూడా జగన్‌ కోడుమూరు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మురళీ కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి కోడుమూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీగా పనిచేశారు. కర్నూలు డీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన అనతికాలంలోనే ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో పార్టీ కర్నూలు డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా పసుపుల ప్రతాప్‌, ఎల్‌పేట నాయుడుతో కలిసి మురళీకృష్ణ బీజేపీలో చేరారు.

Updated Date - Jun 22 , 2025 | 11:39 PM